తెలుగు సినీ పరిశ్రమలో రేణూ దేశాయ్‌కు ఒక ప్రత్యేక స్థానముంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, కేవలం 19 ఏళ్ల వయసులో ‘బద్రి’ (2000) సంవత్సరంలో సినిమా ద్వారా హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. ఆ సినిమా ద్వారా ఎంతో గుర్తింపు పొందినప్పటికీ, కొన్ని సినిమాల తర్వాత నటనకు స్వస్థి చెప్పారు. తన ఫస్ట్ పిక్చర్ హీరో పవన్ కళ్యాణ్‌తో సహజీవనం కొనసాగించి, తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకుని అనుకోని కారణాల వలన విడిపోయారు. పవన్ కళ్యాణ్ – రేణూ దేశాయ్ దంపతులకి ఇద్దరు పిల్లలు జన్మించగా వారి పేర్లు అకీరా నందన్, ఆధ్యా. విడాకుల తర్వాత రేణూ తన పిల్లల పెంపకంపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఒక దశలో రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినా దాన్ని విరమించుకుంది. సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చినా, రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అనేక విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది.. ఫొటోలు, థాట్స్, తన పిల్లల గురించి అప్‌డేట్స్ ఇస్తూ ఫాలోయర్స్‌తో దగ్గరగా ఉంటారు. ఓ దశలో పవన్ ఫ్యాన్స్ నుండి తీవ్ర ట్రోలింగ్ ఎదురవడంతో, కామెంట్ సెక్షన్‌నే ఆఫ్ చేశారు. కానీ తాజాగా మళ్లీ అలాంటి ఆంక్షలను పక్కన పెట్టి, పోస్టులు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో మమేకమవుతున్నారు. తన 21 ఏళ్ల వయసులో తీసుకున్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది రేణూ . “ఛీటింగ్ చేయకుండా మీ 21 ఏళ్ల వయసులో తీసుకున్న ఫొటో షేర్ చేయండి” అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా, “అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలానే ఉన్నారు” అంటూ మెచ్చుకుంటూ కామెంట్లు పెట్టారు ఫ్యాన్స్.

- August 8, 2025
0
109
Less than a minute
Tags:
You can share this post!
editor