టెలివిజన్ షోలతో పాటు యూట్యూబ్ వీడియోలు, ఈవెంట్లతో బిజీగా ఉండే యాంకర్ రవి, అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, తన సినీ ప్రయాణం గురించి, మెగాస్టార్ చిరంజీవితో తనకు జరిగిన ఓ మరిచిపోలేని సంఘటనను షేర్ చేసుకుంటూ భావోద్వేగానికి గురి అయ్యాడు. రవి తొలి సినిమా ఇది మా ప్రేమ కథ రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న టైమ్‌లో చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. ఆయన్ను కలసి నా సినిమా టీజర్‌ను లాంచ్ చేయమని అడగాలి అనుకున్నా. అయితే అప్పటివరకు ఆయన్ని వ్యక్తిగతంగా కలవలేదు. మాటీవీ నెట్‌వర్క్ వాళ్లని ఒకసారి చిరంజీవిని పరిచయం చేయమని అడగ్గా .. ‘చిరంజీవి స్వయంగా పిలిస్తేనే కలవచ్చు’ అన్నారు. ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు షూటింగ్ అయిపోయేవరకు అక్కడే ఎదురుచూశాను. అప్పటివరకు దేవుడికి దండం పెట్టుకున్నా.. ఒక్కసారి చిరంజీవి నా టీజర్ లాంచ్ చేస్తే చాలు’ అని. ఎందుకంటే నాకు దేవుడంటే చిరంజీవే. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తుండగా, ఆయన ఎదురుగా 20 మంది వరకు ఉన్నాం. చిరంజీవి నన్ను దాటి వెళ్లారు. అయితే, మళ్లీ వెనక్కి వచ్చి – ‘మీరేంటి ఇక్కడ?’ అని అడిగారు. ఆ మాట విన్న వెంటనే షాక్ అయ్యా, ఆయనకు నేను తెలుసా? అని అనుకున్నా. సర్, రెండు నిమిషాలు మాట్లాడాలని కోరాను. వెంటనే నన్ను పిలిపించారు. నా జన్మ సార్థకం అయ్యింది అనిపించింది. లోపలికి వెళ్లి, నా టీజర్ గురించి చెప్పాను. ఆయన ఎంతో అపురూపంగా స్పందించారు. ఎక్కడికి రావాలి అని అడిగారు. ‘ఎక్కడికీ రావలసిన పని లేదు సర్.. ల్యాప్ టాప్‌లో లాంచ్ చేస్తే చాలు అన్నాను. టీజర్ చూసిన తర్వాత, డైరెక్టర్‌తో కూడా మాట్లాడి, ఒక బైట్ కూడా ఇచ్చారు. మీ లాంటి యంగ్ బ్లడ్ రావాలి, ఏదైనా అవసరం ఉంటే చెప్పు. సినిమా పూర్తయ్యాక చూపించు అని చిరంజీవి అన్నారు.

- August 8, 2025
0
64
Less than a minute
Tags:
You can share this post!
editor