కాజోల్‌ను హిందీలో మాట్లాడమన్న విలేకరి.. ఆమె సీరియస్.. అంతా షాక్..

కాజోల్‌ను హిందీలో మాట్లాడమన్న విలేకరి.. ఆమె సీరియస్.. అంతా షాక్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె బాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. సౌత్ ఇండస్ట్రీలో ధనుష్ నటించిన విఐపి సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించింది. ఈమె నటనకు సౌత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మూడు దశాబ్దాలుగా నటనలో తనదైన ముద్ర వేసుకున్న కాజోల్ ఇప్పటికీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రీసెంట్‌గా ఈమె తన 51వ పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. తాజాగా ఓ ప్రెస్ మీటింగ్‌లో కాజోల్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఇండస్ట్రీలో పలురకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందో కాస్తవివరంగా తెలుసుకుందాం. తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న కాజోల్ విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పారు. తన సినిమాల గురించి చెప్తున్న సందర్భంలో ఓ విలేకరి మేడం హిందీలో మాట్లాడండి అని అడిగారు. ఆ మాట వినగానే కాజోల్‌కు కోపం వచ్చింది. నేను హిందీలో మాట్లాడితే ఎవరికైనా అర్థం అవుతుందా అని అతనిపై సీరియస్ అయింది. నేను మరాఠీ, ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడతాను అని చెప్పడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. కొందరేమో ఆమెను సపోర్ట్ చేస్తూ అది ఆమె ఇష్టం ఆమె ఏ భాషలో మాట్లాడుతుందో అది ఆమెకు సంబంధించింది అని కామెంట్ చేయగా.. మరికొందరేమో ఎందుకు కాజోల్ హిందీలో మాట్లాడడం లేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.

editor

Related Articles