బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘వార్ 2’. యష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్యచోప్రా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ చేస్తోంది చిత్రయూనిట్. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్‌డేట్‌ను షేర్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేసిన సలామ్ అనాలి అనే పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. దూనియా సలామ్ అనాలి అంటూ సాగిన ఈ పాట ప్రస్తుతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ పాట ఫుల్ వీడియోను థియేటర్‌లోనే చూడాలి అంటూ మేకర్స్ చెబుతున్నారు.

- August 7, 2025
0
76
Less than a minute
Tags:
You can share this post!
editor