ముంబై బ్యూటీ సాక్షి మాలిక్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎంతగానో అలరిస్తోంది. స్టైలిష్ ఫొటోషూట్లు, ఫిట్నెస్ కంటెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోయర్స్‌ను సంపాదించుకుంది. సాక్షికి పెద్ద ఎత్తున పాపులారిటీ తెచ్చిన ప్రాజెక్ట్ సోను కె టిటు కి స్వీటీ సినిమాలోని హిట్ సాంగ్ బోమ్ డిగ్గీ డిగ్గీ. ఈ పాటలో ఆమె స్టన్నింగ్ లుక్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో యువతను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇటీవల సాక్షి రకరకాల భంగిమల్లో ఫొటో షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. టాప్ మోడల్‌గా సాక్షి టీవీ కమర్షియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. 2020లో మారుతి ఆటో ఎక్స్పో వేదికపై బ్రాండ్ అంబాసిడర్‌గా పాల్గొని ప్రత్యేకంగా నిలిచింది. ఆ తరువాత సినీ రంగంపై దృష్టి సారించింది. కాలేజీ రోజుల్లోనే ఫ్యాషన్ షోలలో పాల్గొంటూ మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. నైకా, పిసి జ్యువెలర్స్ వంటి ప్రముఖ బ్రాండ్లకు ప్రచారం చేసింది. తాజాగా ఆమెకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండగా, ఇందులో సాక్షిని కొరియోగ్రాఫర్ రాఘవ్ జుయల్ చెంపదెబ్బ కొట్టినట్టు కనిపించింది. దీంతో కారణం లేకుండా ఆమెని ఎందుకు కొట్టావంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో సాక్షి మాలిక్ స్పందిస్తూ.. ఇది మా యాక్టింగ్‌లో ఒక భాగంగా వచ్చిన వీడియో తప్ప, ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశంతో కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే దీనిపై కొందరు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ మానండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

- August 7, 2025
0
42
Less than a minute
Tags:
You can share this post!
editor