టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆయనపై ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో విచారణ జరిపారు ఈడీ అధికారులు. పలువురు సినీ, టీవీ ప్రముఖులపై దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండను కూడా కీలక ప్రశ్నలతో ఈడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ, తాను ప్రమోట్ చేసిన యాప్ బెట్టింగ్ యాప్ కాదని, అది గేమింగ్ యాప్ మాత్రమేనని స్పష్టం చేశారు. A23 అనే గేమింగ్ యాప్‌కి ప్రచారం చేసిన విషయాన్ని అంగీకరిస్తూ, “దేశంలో గేమింగ్ యాప్‌లు అనేక రాష్ట్రాల్లో లీగల్. కానీ నేను ప్రచారం చేసిన ఈ యాప్ తెలంగాణలో ఓపెన్ కాదు” అని తెలిపారు. ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. నా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు కూడా సమర్పించాను. నాకే తెలియకుండా ఈ వివాదంలో నా పేరు లాగబడింది అని విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఎ పాల్ తీవ్రంగా స్పందించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు విజయ్ దేవరకొండ తక్షణమే క్షమాపణ చెప్పాలని, ఆ ప్రకటనల ద్వారా సంపాదించిన డబ్బును బాధితులకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు.

- August 7, 2025
0
35
Less than a minute
Tags:
You can share this post!
editor