టాలీవుడ్ సెన్సేషనల్ పాట ‘కుర్చీ మడతబెట్టి’ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఊపేస్తోంది. ఈ పాటకు తాజాగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అదిరిపోయే స్టెప్పులేసి సోషల్ మీడియాను వైరల్‌గా మార్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన ఈ పాట గుంటూరు కారం సినిమాలోనిది. త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగవంశీ, రాధాకృష్ణ నిర్మించారు. 2024లో వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాటలు మాత్రం చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇందులో ‘కుర్చీ మడతబెట్టి’ పాట అయితే 2024లో టాప్ 10లో నిలిచిందని చెప్పవచ్చు. అయితే తాజాగా, జాక్వెలిన్ ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్, ఎనర్జీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అవార్డుల ఈవెంట్‌లో భాగంగా జాక్వెలిన్ ఈ పాటకు డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక జాక్వెలిన్ కుర్చీ మడతబెట్టి పాటకు డ్యాన్స్ చేయడం పట్ల మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- August 2, 2025
0
138
Less than a minute
Tags:
You can share this post!
editor