నేను ప్రేమ పెళ్లే చేసుకుంటాను.. అనుష్క శెట్టి

నేను ప్రేమ పెళ్లే చేసుకుంటాను.. అనుష్క శెట్టి

హీరోయిన్ అనుష్క శెట్టి క్లాస్‌, మాస్‌ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. స్టార్ హీరోలందరితో కలిసి హిట్టైన సినిమాలు చేసింది. ‘బాహుబలి’ అనంతరం ఆమెకు పాన్-ఇండియా క్రేజ్ వచ్చింది. అదే సమయంలో సహనటుడు ప్రభాస్‌తో అనుష్క డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు మొదలయ్యాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయాలను అనుష్క, ప్రభాస్ ఇద్దరూ ఖండించారు. ఆ తరువాత ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో కూడా అనుష్క పెళ్లి వార్తలు చక్కర్లు కొట్టాయి. అవి కూడా చివరికి వదంతులేనని తేలిపోయాయి. తాజా ఇంటర్వ్యూలో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది అనుష్క‌. అనుష్క  ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ… బాహుబలి విడుదలైన తర్వాత నాపై పెళ్లి ఒత్తిడి ఎక్కువైంది. కుటుంబ సభ్యులే కాదు, మీడియా నుండి కూడా ఇదే ప్రశ్న వస్తోంది. నాకు పెళ్లిపై పూర్తి నమ్మకం ఉంది. సరైన వ్యక్తి, సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ప్రేమ లేకుండా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నేను ప్రేమించే వ్యక్తినే వివాహం చేసుకుంటాను. నా తల్లిదండ్రులు ఈ విష‌యంలో నాకు మద్దతుగా ఉన్నారు అని చెప్పింది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోను అని అనుష్క తేల్చి చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె భవిష్యత్తు జీవిత భాగస్వామి ఇండస్ట్రీ వ్య‌క్తి కాద‌నే క్లారిటీ వ‌చ్చింది.

editor

Related Articles