‘OG’లో  పవ‌న్‌క‌ళ్యాణ్  కాల‌ర్  ప‌ట్టుకున్న  వెంకట్ 

‘OG’లో  పవ‌న్‌క‌ళ్యాణ్  కాల‌ర్  ప‌ట్టుకున్న  వెంకట్ 

పవన్‌కళ్యాణ్ నటించిన సినిమా హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లుని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాగా.. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో న‌డుస్తోంది. మ‌రోవైపు ద‌ర్శ‌కుడు సుజిత్‌తో ఓజీ అనే సినిమాను కూడా కంప్లీట్ చేశాడు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని షేర్ చేశాడు నటుడు వెంక‌ట్. సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. అనంత‌రం అన్నయ్య, ఆనందం, శివరామరాజు లాంటి సినిమాల్లో పాపుల‌ర్ న‌టుడిగా మారాడు. ఆ త‌ర్వాత కెరీర్‌లో హీరోగా నిల‌దొక్కుకోలేకపోయాడు వెంక‌ట్. రీసెంట్‌గా ఇచ్చ‌ట వాహ‌నములు నిల‌ప‌రాదు  సినిమాలో నటించాడు. అయితే ఈ న‌టుడు పవ‌న్ న‌టిస్తున్న ఓజీలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నట్లు తెలిపాడు. సినిమాలో ఓ స‌న్నివేశంలో పవ‌న్ క‌ళ్యాణ్ కాల‌ర్ ప‌ట్టుకునే సీన్ ఉంద‌ని.. అని ద‌ర్శ‌కుడు చెప్ప‌గానే నాకు భ‌యం వేసిందని వెంక‌ట్ చెప్పుకొచ్చాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద స్టార్. ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఆయనను తాకడమే పెద్ద విషయం. నువ్వు డైరెక్ట్‌గా కాలర్ ప‌ట్టుకోమంటున్నావు. ఆయన ఫ్యాన్స్  ఊరుకుంటారా, నా వల్ల కాదు అని ద‌ర్శ‌కుడికి చెప్పేశాను. అయితే సుజిత్ మాత్రం మీరు ఏం చేస్తారో తెలియదు కానీ మీరే అన్నయ్యని ఒప్పించి కాలర్ పట్టుకోవాలి అని న‌న్ను ఇరికించాడు. దీంతో నేను భ‌యంగానే ఆయ‌న ద‌గ్గ‌రికి వెళ్లి అన్న‌య్య నేను మీ కాల‌ర్ ప‌ట్టుకోవాలి ఒక సీన్‌లో అని చెప్పాను. దీనికి ప‌వ‌న్. ఒకే దాంట్లో ఏముంది అంటూ సీన్‌ని ఒకే చేశాడంటూ వెంక‌ట్ చెప్పుకొచ్చాడు.

editor

Related Articles