కొత్త సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకులకంటే ముందు చూస్తున్న దర్శకుడు రాజమౌళి. సినిమా బాగుంది అని టాక్ వచ్చిన వెంటనే ఆ సినిమాకు వెళుతుంటారు. ఇటీవల హాలీవుడ్ నుండి వచ్చిన F1 సినిమా చూస్తూ మీడియా కంటపడ్డ రాజమౌళి మరోసారి సినిమాకు వచ్చి కెమెరాకు దొరికారు. హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘కింగ్డమ్’. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. నాగవంశీ నిర్మించాడు. సత్యదేవ్ కీలక పాత్రలో నటించాడు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాని రాజమౌళి ఫ్యామిలీతో కలిసి చూశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

- August 1, 2025
0
68
Less than a minute
Tags:
You can share this post!
editor