ఈ ఏడాదిలో మన టాలీవుడ్ దగ్గర ప్రస్తుతానికి ఉన్న బిగ్గెస్ట్ క్లాష్ ఏదన్నా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా, అలాగే హీరో బాలకృష్ణ కలయికలో వస్తున్న సెన్సేషనల్ సినిమాలు (1) “ఓజి” అలాగే (2) “అఖండ 2” ల క్లాష్ అని చెప్పవచ్చు. ఇద్దరి కెరీర్‌లో కూడా ఇవే భారీ హైప్‌ని సెట్ చేసుకున్నాయి. దీనితో ఈ ఎపిక్ క్లాష్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే రెండు సినిమాలకి ఇప్పుడు ఒకటే సమయం మిగిలి ఉంది. కానీ ఓజి ఆల్‌రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది. అఖండ సినిమా ఇంకా కొంత షూటింగ్ మిగిలి ఉంది. ఇక ఆల్‌రెడీ ఓజి ఫస్ట్ సింగిల్‌పై అప్‌డేట్ కూడా వచ్చేసింది. అంటే రిలీజ్ దగ్గరకి ముందు పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో మేకర్స్ వచ్చేస్తున్నారు కానీ ఇదే సినిమాతో క్లాష్‌లో ఉన్న అఖండ 2 మాత్రం ఇంకా ఫస్ట్ సింగిల్ లేదా ఇతర అప్‌డేట్స్ పరంగా వెనుకబడే ఉన్నారు. మరి వీరెప్పుడు అప్‌డేట్ స్టార్ట్ చేస్తారో చూడాలి. ఇప్పుడు ఆగస్ట్ కూడా వచ్చేసింది. ఈ రెండు నెలల గ్యాప్‌లో ఎలా ప్లాన్ చేస్తారో వేచి చూడాలి.

- August 1, 2025
0
38
Less than a minute
Tags:
You can share this post!
editor