‘సుందరకాండ’ ఆగస్ట్ 27న రిలీజ్..

‘సుందరకాండ’ ఆగస్ట్ 27న రిలీజ్..

నారా రోహిత్‌ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సుందరకాండ’. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు. సంతోష్‌ చిన్నపొల్ల, గౌతమ్‌రెడ్డి, రాజేష్‌ మహంకాళి నిర్మాతలు. ఈ నెల 27న సినిమా రిలీజ్ కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా నుండి పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ‘ప్లీజ్‌ మేమ్‌..’ అంటూ సాగే ఈ పాటను శ్రీహర్ష ఈమని రాయగా, లియోన్‌ జేమ్స్‌ స్వరపరిచారు. అర్జున్‌ చాందీ, దీపక్‌ బ్లూ, అరవింద్‌ శ్రీనివాస్‌, సాయిశరణ్‌, రేష్మా శ్యామ్‌, హరిప్రియా కలిసి ఈ పాటను ఆలపించారు. హీరోయిన్  శ్రీదేవిని ఇంప్రస్‌ చేసేందుకు హీరో తన ఫ్రెండ్స్‌తో కలిసి చేసే ప్రయత్నమే ఈ పాట. విశ్వరఘు కొరియోగ్రఫీ ఈ పాటకు హైలైట్‌. వృతి వాఘాని మరో హీరోయిన్‌గా ‌నటిస్తున్న ఈ సినిమాలో నరేష్‌, వాసుకి ఆనంద్‌, సత్య, అజయ్‌, అభినవ్‌ గోమటం, విశ్వంత్‌, రూపలక్ష్మి, సునైనా, రఘుబాబు ఇతర పాత్రధారులు.

editor

Related Articles