బుల్లితెర ప్రేక్షకుల అభిమాన షో బిగ్‌బాస్ మరోసారి తెరపైకి రావడానికి సిద్దమవుతోంది. తెలుగుతో సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ పాపులర్ రియాలిటీ షో త్వరలోనే కొత్త సీజన్‌తో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హిందీ సీజన్ 19 ప్రీమియర్‌కు తేదీ లాక్ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే 18 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసిన బిగ్‌బాస్ హిందీ వెర్షన్‌కు మంచి క్రేజ్ సంపాదించుకుంది. 19వ సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి కూడా షోను బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ హోస్ట్ చేయనున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో సల్మాన్ ఖాన్ ఒక రాజకీయ నాయకుడి గెటప్‌లో కనిపిస్తూ, “ఈసారి ఇది హౌస్‌మేట్స్ ప్రభుత్వం” అంటూ కొత్త థీమ్‌కి హింట్ ఇచ్చారు. ఈ ప్రోమోతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. బిగ్‌బాస్ 19 ఈసారి ఆగస్టు 24న గ్రాండ్ ప్రీమియర్‌తో ప్రారంభం కానుంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఓ పెద్ద ప్రయోగం చేయబోతున్నారు. గత ఏడాది షోని మూడున్నర నెలలు నడిపించగా, ఈసారి మాత్రం మొత్తం ఐదున్నర నెలల పాటు షో సాగనుందని సమాచారం. వివిధ రంగాల ప్రముఖులు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ 19 షో జియో హాట్‌స్టార్‌లో డిజిటల్‌గా, కలర్స్ ఛానెల్ ద్వారా టీవీలో ప్రసారం కానుంది. ఈ సారి షోలో వచ్చే ట్విస్టులు, టాస్కులు, డ్రామా ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్‌లో తెలుగు బిగ్ బాస్ మొదలు కానుంది. ఈ షోకి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో సామాన్యులకి కూడా ఛాన్స్ దక్కడంతో షోపై వీక్షకుల ఆసక్తి రెట్టింపైంది..

- August 1, 2025
0
93
Less than a minute
Tags:
You can share this post!
editor