క్యాస్టింగ్ కౌచ్ వ‌ల్ల ఆఫ‌ర్లు కోల్పోయిన నటి ఎవరో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ వ‌ల్ల ఆఫ‌ర్లు  కోల్పోయిన నటి ఎవరో తెలుసా?

బాలీవుడ్, టీవీ నటి ఇందిరా కృష్ణన్ క్యాస్టింగ్ కౌచ్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. త‌న కెరీర్‌లో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను షేర్ చేసింది. తాను నో చెప్ప‌డం వ‌ల్ల పెద్ద పెద్ద సినిమాలు కోల్పోయాను అంటూ న‌టి చెప్పుకొచ్చింది. ఇందిర మాట్లాడుతూ.. ముఖ్యంగా సౌత్ ఇండ‌స్ట్రీలో నాకు ఇలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. కొన్ని ప్రాజెక్ట్‌ల‌లో తాను హీరోయిన్‌గా ఎంపికైన‌ప్ప‌టికీ క‌మిట్‌మెంట్ అడిగినందుకు నేను నో చెప్ప‌డం వ‌ల‌న ఆ సినిమాల‌లో అవకాశం కోల్పోయాను. నేను నా టాలెంట్‌ను అమ్ముకోవ‌డానికి వ‌చ్చాను కానీ.. నాకు నేను అమ్ముడుపోను అంటూ వారికి గ‌ట్టిగా స‌మాధానం చెప్పి వ‌చ్చాను. కొన్నిసార్లు  మ‌నం మాట్లాడే మాటలు కఠినంగా అనిపించినా కూడా చెప్పాల్సిన టైములో  చెప్పేయాలి. అప్పుడే ముందుకు వెళ్ల‌గలుగుతాం. అయితే సినిమాల‌లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్న త‌ర్వాతే తాను టెలివిజన్ రంగంలోకి వెళ్లాను. అక్క‌డ ఇలాంటి స‌మ‌స్య‌లేం క‌నిపించ‌లేదంటూ ఇందిరాకృష్ణ‌న్ చెప్పుకొచ్చారు.

editor

Related Articles