కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా ఇప్పుడు కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో కూడా పలు సాలిడ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో లేటెస్ట్‌గా మరో భారీ సినిమా యాడ్ అయ్యింది. అది కూడా మన టాలీవుడ్ నిర్మాత నాగవంశీ కాంబినేషన్‌లో ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా అనౌన్స్ చేశారు. ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ పోస్టర్‌తో తమ బ్యానర్‌లో 36వ సినిమాగా దీనిని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సినిమాని దర్శకుడు అశ్విన్ గంగరాజు తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే ఒక భారీ యుద్ధ సన్నివేశం చుట్టూ తుపాకులు మధ్యలో ఒక మనిషి ముసుగు కప్పుకొని వెనుక రెండు కత్తులతో నిలబెట్టినట్టు కనిపిస్తోంది. అలాగే ఈ టోన్ చూస్తే సినిమా భారీ పీరియాడిక్ సినిమాలా కూడా అనిపిస్తుంది. మొత్తానికి మాత్రం సితార కాంపౌండ్ నుండి ఇదొక బిగ్ సినిమా అని చెప్పవచ్చు. ఇక దీనిపై మరిన్ని డిటైల్స్ రావాల్సి ఉంది.

- July 30, 2025
0
112
Less than a minute
Tags:
You can share this post!
editor