రీసెంట్‌గా ఇండియన్ సినిమా దగ్గర ఒక సర్‌ప్రైజింగ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది యానిమేషన్ సినిమా “మహావతార్ నరసింహ” అని చెప్పాలి. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ డివోషనల్ యాక్షన్ డ్రామా లిమిటెడ్‌గా రిలీజ్ అయ్యి ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తోంది. వీకెండ్ అయ్యి వారాంతంలోకి వచ్చిన తర్వాత కూడా సెన్సేషనల్ రన్‌ని ఈ సినిమా చూపించడం గమనార్హం. రిలీజ్ రోజు కేవలం 80 వేలకి పైగా టికెట్స్ తెగిన ఈ సినిమాకి బుక్ మై షోలో ఇప్పుడు వర్కింగ్ డే అయిన నిన్న మంగళవారం ఏకంగా 2 లక్షల 30 వేలకి పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. ఇది మొన్న హాలిడే ఆదివారం నాటి కలెక్షన్లతో సమానం. ఈ లెక్కన మహావతారా నరసింహ సెన్సేషన్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి సామ్ సి ఎస్ సంగీతం అందించారు.

- July 30, 2025
0
57
Less than a minute
Tags:
You can share this post!
editor