నేడు ఈడీ వద్దకు ప్ర‌కాష్‌రాజ్

నేడు ఈడీ వద్దకు ప్ర‌కాష్‌రాజ్

బెట్టింగ్ యాప్స్ కేసుకి సంబంధించి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులకు నోటీసులు జారీచేసిన ఈడీ, తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌కు కూడా నోటీసు పంపింది. ఈడీ అధికారుల నుండి వచ్చిన సమన్ల మేరకు ప్రకాష్‌రాజ్ ఈ రోజు (బుధవారం, జులై 30) విచారణకు హాజరుకానున్నారు. ఆయన ‘జంగిల్ రమ్మీ’ అనే బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన యాడ్‌లో నటించినట్టు చెప్పారు, అది ఆధారంగా బేస్ చేసుకుని నోటీసులో ఆయన పేరు చేర్చినట్లు తెలుస్తోంది.

editor

Related Articles