ఇంటర్వ్యూలలో అనసూయ ఏ విషయంపైనైన చాలా ఓపెన్‌గా ఉంటుంది. తాజాగా తన భర్తకి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది మా ఆయన పర్‌ఫెక్ట్ అని అందరూ అనుకుంటారు. కాని ఆయన కూడా అందరి మగాళ్లలాగే. మా ఇద్దరి మధ్య కూడా కొన్ని సందర్భాలలో గొడవలు అయ్యాయి. నేను వెళ్లి కొంతమందిని కలవడం. కొంతమందితో సినిమాలు చేయడం ఆయనకి నచ్చదు. ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ గొడవలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. నేను హీరోలతో.. పెద్ద పెద్ద స్టార్‌లతో.. గుడ్ లుకింగ్ పీపుల్స్‌తో ఇంట్రాక్ట్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. అబ్బాయిల మనస్తత్వమే అంత. సాధారణంగా అందరూ కూడా అనసూయ భర్త అన్నీ చేయనిస్తాడు, అన్నింటికీ ఒప్పుకుంటాడు అని అనుకోవచ్చు. వాడు చేతకాని వాడు అని కూడా అంటారు. అదృష్టం ఏంటంటే మా ఆయనకి తెలుగు రాదు. సోషల్ మీడియాలో కామెంట్స్ పట్టించుకోడు. ఆయనలా ఉండాలని నేను ఎన్నోసార్లు అనుకుంటాను. నేను మా ఆయనతో ఉన్నట్టు వేరే వాళ్లతో ఉండలేను. నాకు వేరే వ్యక్తి బ్యాడ్‌గా అనిపిస్తే.. నేను అతనికి బ్యాడ్‌గా కనిపిస్తా. అది హ్యూమన్ సైకాలజీ అంతే. నేను కూడా మా ఆయనతో ఇన్‌సెక్యుర్డ్‌గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పుకొచ్చింది.
- July 30, 2025
0
63
Less than a minute
Tags:
You can share this post!
editor

