‘వార్ 2’  తర్వాతే  ‘కూలీ’  అని  చెప్పాలి..

‘వార్ 2’  తర్వాతే  ‘కూలీ’  అని  చెప్పాలి..

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఆడియెన్స్ మంచి ఎక్స్‌పీరియన్స్‌తో సినిమా చూసేందుకు  వస్తున్న  వార్ 2 అలాగే కూలీ సినిమాలు ఉన్నాయి. హీరో జూ. ఎన్టీఆర్, హీరో హృతిక్ రోషన్‌లు కలయికలో వార్ 2 అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నుండి కూలీ రాబోతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఆడియెన్స్‌లో నెలకొనగా ఎప్పుటి నుండో రెండు వర్గాలుగా సోషల్ మీడియాలో ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.  చాలామంది కూలీ అంటున్నారు కానీ బుక్ మై షోలో మాత్రం ట్రెండ్ వేరేలా ఉంది. ఇక్కడ కూలీకి మించి వార్ 2 కి హైప్ కనిపిస్తోంది. కూలీ సినిమాకి 2 లక్షల మేర ఇంట్రెస్ట్‌లు కనిపిస్తే వార్ 2 కి మాత్రం మూడున్నర లక్షలకి పైగా ఇంట్రెస్ట్‌లు నమోదు అయ్యాయి. దీంతో ఇక్కడ క్లియర్‌గా వార్ 2 డామినేషన్ కనిపిస్తోందని చెప్పవచ్చు. ఇక ఆగస్ట్ 14న విడుదల అవుతున్న ఈ రెండు సినిమాలు ఎలాంటి రెస్పాన్స్‌ని అందుకుంటాయో వేచి చూడాలి.

editor

Related Articles