‘కింగ్‌డమ్’ నుండి ‘రగిలే రగిలే’ సాంగ్ రిలీజ్!

‘కింగ్‌డమ్’ నుండి ‘రగిలే రగిలే’ సాంగ్ రిలీజ్!

టాలీవుడ్ హీరో ది విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన  సినిమాయే  “కింగ్‌డమ్”. అనౌన్స్ చేసిన నాటి నుండి ఇప్పుటి వరకు మంచి హైప్‌ని సెట్ చేసుకున్న ఈ సినిమా నుండి ఇప్పుడు మరో కొత్త పాట బయటకి వచ్చింది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ స్వరపరిచిన ఈ ‘రగిలే రగిలే’ సాంగ్ మంచి పవర్‌ఫుల్‌గా గూస్ బంప్స్ ఇచ్చే లెవెల్లో ఉందని చెప్పాలి. రీసెంట్ గానే వైబ్ ఉంది సాంగ్‌తో ఇంప్రెస్ చేసిన సాహిత్య రచయిత కృష్ణకాంత్ రచించిన ఈ పాట పదునైన పదాలతో ఆకట్టుకుంటోంది. ఇక దీంతో పాటుగా అనిరుధ్ మార్క్ క్రేజీ బీట్స్ మరింత హైప్ ఎక్కించేలా ఉన్నాయి. మొత్తానికి మాత్రం ఈ సరికొత్త సాంగ్ థియేటర్స్‌లో బ్లాస్టింగ్ ట్రీట్ ఇస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని  నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణం వహించగా ఈ జులై 31న అంటే రెండు రోజుల్లో గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి రాబోతోంది.

editor

Related Articles