బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం మనందరికి తెలిసిందే. తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఎన్నో జ్ఞాపకాలను షేర్ చేస్తూ ఉంటారు. తన వ్యక్తిగత జీవితం, సినిమాల విశేషాలు, ఇతర నటులపై తన అభిప్రాయాలను తన బ్లాగ్‌లోనూ షేర్ చేయడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన తన బ్లాగ్ ద్వారా 1975లో విడుదలైన క్లాసిక్ సినిమా ‘షోలే’ కు సంబంధించిన ఓ అరుదైన జ్ఞాపకాన్ని అభిమానులతో షేర్ చేశారు. అది ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ టికెట్ కాగా, అది అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇండియన్ సినిమాకు మైలురాయిగా నిలిచిన ‘షోలే’ ఈ ఏడాది అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంటోంది. 1975, ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా, అప్పటి నుండి ఇప్పటి వరకు సినీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. బాలీవుడ్‌లోనే కాదు, భారతీయ చలనచిత్ర రంగంలోనే ఓ దిగ్గజ సినిమాగా నిలిచిపోయిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా, అప్పట్లో వసూళ్ల పరంగా రికార్డులు తిరగరాసింది. తాజాగా అమితాబ్ బచ్చన్ తన వద్ద ఉన్న షోలే టికెట్‌ను షేర్ చేశారు.

- July 29, 2025
0
40
Less than a minute
Tags:
You can share this post!
editor