హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా ‘కింగ్‌డమ్’ జులై 31న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమైంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ సరికొత్త గెటప్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అన్నదమ్ముల సెంటిమెంట్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని సినిమా యూనిట్ చెబుతోంది. కాగా, రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే, ఈ సినిమాకి ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు ఇదే సినిమా యూనిట్‌కు కొత్త సమస్య తెచ్చిపెట్టింది. టికెట్ రేట్లు జూలై 31 నుండి పెంచుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ, ఈ సినిమా ప్రీమియర్స్ జులై 30న వేయనున్నారు. దీంతో ప్రీమియర్ షోలకు టికెట్ రేట్ల పెంపు ఉంటుందా లేదా అనేది డైలమాలో పడింది. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

- July 28, 2025
0
138
Less than a minute
Tags:
You can share this post!
editor