బాలీవుడ్ స్టార్ బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ నుండి ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ 2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వార్’ సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో పాటు, టాలీవుడ్ జూనియర్ ఎన్టీఆర్, నటి కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మొదటి పార్ట్‌లో నటించిన బాలీవుడ్ నటి వాణీకపూర్ వార్ 2లో చేయకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా పాత్ర వార్ పార్ట్ 1తోనే కంప్లీట్ అయింది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, టైగర్ ష్రాఫ్, నేను కలిపి ముగ్గురం ఈ సీక్వెల్‌లో లేము. నేను, టైగర్ ఇద్దరము ‘వార్’లో చనిపోయాము. కాబట్టి టైగర్ పాత్ర తిరిగి ప్రవేశబెడితే, నేను కూడా తిరిగి వచ్చేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది వాణీకపూర్. వాణీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా రాబోతున్న ‘మండల మర్డర్స్’ అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్రల్లో నటిస్తోంది.

- July 26, 2025
0
95
Less than a minute
Tags:
You can share this post!
editor