మలయాళ సినిమాల్లో నటించిన నటుల్లో మంచి ఆదరణ పొందిన స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ఒకరు. తెలుగులో పుష్ప సినిమాలతో మరింత రీచ్‌ని అందుకున్న ఈ నటుడు తన సినీ కెరీర్‌పై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. అయితే సౌత్‌లో తన టాలెంట్‌తో తెలుగు, తమిళ్, మళయాళ భాషల్లో సత్తా చాటిన ఫహద్ తన రిటైర్మెంట్ కోసం చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. తన నటన ఎప్పుడైతే ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది అని అనిపిస్తుందో ఆ రోజున నేను సినిమాలు ఆపేస్తానని తెలిపారు. అలాగే సినిమాలు ఆపేసి బార్సిలోనాలో ఒక క్యాబ్ డ్రైవర్‌గా లైఫ్ లీడ్ చేసుకుంటానని ఫహద్ తెలిపాడు. ఇక ఫహద్ నుండి ప్రస్తుతం మారేశన్ అనే సినిమా విడుదలకి రాగా, మరికొన్ని రోజుల్లో మిగిలిన సినిమాలు తాను యాక్ట్ చేసినవి రాబోతున్నాయి.

- July 26, 2025
0
80
Less than a minute
Tags:
You can share this post!
editor