టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అర్జున్ రెడ్డి వంటి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్‌లో కబీర్ సింగ్‌గా తెరకెక్కించి సూపర్ హిట్‌ను అందుకోవడంతో నిర్మాతల కళ్లల్లో పడ్డాడు. ఇక యానిమల్ సినిమాతో స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్. ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే రీసెంట్‌గా విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్‌డమ్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న సందీప్ తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి సినిమాపై ఆసక్తికర కామెంట్లు చేశాడు. అర్జున్ రెడ్డి సినిమాను నేను నిర్మించడం వలన కొన్ని సన్నివేశాలు బడ్జెట్ లేక తీయలేకపోయాను. ఎందుకంటే అప్పటికే మా బడ్జెట్‌కి మించి చేశాం. అయితే నాకు ఇప్పటికీ ఒక రిగ్రెట్ ఉంది. ఈ సినిమాలో ఫుట్‌బాల్ మ్యాచ్‌ని మంగళూర్‌లోని ఒక గ్రౌండ్‌లో వర్షం పడుతున్నప్పుడు తీద్దామనుకున్నాం. కానీ బడ్జెట్ కుదరక వర్షం సీన్‌ని కట్ చేసి కేవలం మ్యాచ్ సన్నివేశాన్ని మాత్రమే తెరకెక్కించాం అంటూ సందీప్ చెప్పుకొచ్చాడు.

- July 26, 2025
0
55
Less than a minute
Tags:
You can share this post!
editor