ప్ర‌భాస్ ‘స్పిరిట్‌’పై సందీప్ వంగ కామెంట్స్

ప్ర‌భాస్ ‘స్పిరిట్‌’పై సందీప్ వంగ కామెంట్స్

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ సినిమా ల‌వ‌ర్స్ ఎదురుచూస్తున్న సినిమాల‌లో స్పిరిట్ కూడా ఒక‌టి. ప్ర‌భాస్ హీరోగా రాబోతున్న ఈ సినిమాలో సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. తృప్తి దిమ్రీ  హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండ‌గా.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాపై ఎటువంటి అప్‌డేట్ రాలేదన్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీద‌కి వెళ్లేది ఎప్పుడో క‌న‌ఫ‌ర్మ్ చేశాడు ద‌ర్శ‌కుడు సందీప్. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌గా రాబోతున్న కింగ్‌డ‌మ్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న సందీప్ దీనిగురించి మాట్లాడారు. స్పిరిట్ సెప్టెంబ‌ర్ చివ‌రివారంలో షూటింగ్ మొదలు  కాబోతోందని అప్ప‌టినుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జరుగుతుంద‌ని సందీప్ వంగా చెప్పుకొచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌ అయ్యింది.

editor

Related Articles