‘పరదా’ ఆగస్ట్  22న రిలీజ్..

‘పరదా’ ఆగస్ట్  22న రిలీజ్..

తెలుగు ప్రేక్షకులకు మలయాళ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ సినిమాలో రావు రమేష్ కూతురు వల్లీగా నటించిన అనుపమ పల్లెటూరి గర్ల్ లుక్‌తో ఆకట్టుకున్నారు. అదే ఏడాది నాగచైతన్యతో నటించిన ‘ప్రేమమ్’ లోనూ ఆమె కనిపించి మరోసారి ఫ్యాన్స్‌ను మెప్పించారు. ఈ రెండు సినిమాల్లోనూ ఆమె సెకండ్ హీరోయిన్‌గా కనిపించినా, తన పాత్రలకు 100% న్యాయం చేస్తూ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. అనంతరం శర్వానంద్‌తో కలిసి నటించిన ‘శతమానం భవతి’ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఈ విజయంతో తెలుగు పరిశ్రమలో త‌న స్థానాన్ని ప‌దిల‌ప‌రుచుకుంది. ఆ ఆర్వాత అనుపమ వరుసగా సినిమాల్లో నటిస్తూ, రొమాంటిక్ డ్రామాలు, కామెడీ, థ్రిల్లర్‌లలో తన పాత్రల ద్వారా వైవిధ్యాన్ని చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. 2023లో విడుదలైన ‘టిల్లూ స్క్వేర్’ అనుపమ కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్లు  రాబట్టి, ఆమెకు ‘100 కోట్ల హీరోయిన్’ అనే టైటిల్‌ను తెచ్చి పెట్టింది. ఇందులో ఆమె స్టైలిష్ లుక్, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆమె డిమాండ్ మరింత పెరిగింది. ప్రస్తుతం అనుపమ ‘పరదా’ అనే ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పోస్టు-ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న‌ ‘పరదా’ సినిమాను ఆగస్టు 22న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

editor

Related Articles