మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరక్కించిన భారీ సినిమా కింగ్‌డమ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక విడుదలకి అత్యంత చేరువలో ఉన్న ఈ సినిమా తాలూకా హంగామా ఆల్‌రెడీ మొదలైంది. తాజాగా తిరుపతి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్‌లో విజయ్ 40 అడుగుల భారీ కటౌట్‌ని ఎస్టాబ్లిష్ చేయడం వైరల్‌గా మారింది. సినిమాలో విజయ్ చేసిన సూరి మాస్ లుక్‌ని కటౌట్‌గా మార్చి పెట్టడం వైరల్‌గా మారింది. ఇక రేపు జులై 26న గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని జరపనున్నారు. ఈ ట్రైలర్‌పై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
- July 25, 2025
0
321
Less than a minute
Tags:
You can share this post!
administrator

