హీరో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిల్వర్ స్క్రీన్ డైనమైట్ అంటూ ఫ్యాన్స్ ఆయన్ని పిలుస్తుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన స్పైయాక్షన్ థ్రిల్లర్ ‘వార్-2’ ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో ఎన్టీఆర్ నటించిన తొలి స్ట్రెయిట్ సినిమా ఇదే కావడంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ సినిమా కోసం కొందరు ఫ్యాన్స్ వినూత్నరీతిలో ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ సిటీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సరికొత్త పంథాలో ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించారు. ప్రత్యేక ఏర్పాట్లతో విమానాల ద్వారా ఆకాశంలో ఎన్టీఆర్, వార్-2 అనే పేర్లను డిస్‌ప్లే చేశారు. గగనతలంపై తమ అభిమాన హీరో పేరు చూసుకుని అక్కడి ఫ్యాన్స్ థ్రిల్ ఫీలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందించిన ‘వార్-2’ సినిమాకి ఆయాన్ ముఖర్జీ డైరెక్షన్ చేస్తున్నారు.

- July 25, 2025
0
82
Less than a minute
Tags:
You can share this post!
editor