బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న వార్ 2 సినిమా సరికొత్త రికార్డును బద్దలు కొట్టనుంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా డాల్బీ అట్మాస్ థియేటర్లలో ప్రదర్శించబడనుంది. దీంతో ఇండియాలో భారీ స్థాయిలో డాల్బీ అట్మాస్ థియేటర్లలో విడుదలవుతున్న మొదటి ఇండియన్ సినిమాగా ‘వార్ 2’ నిలవనుంది. ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు. దీనివలన ఆడియన్స్ డాల్బీ అట్మాస్ సౌండ్‌ను అద్భుతంగా ఆస్వాదించగలుగుతారని.. ఇది భారతీయ చిత్ర నిర్మాణంలో ఒక కొత్త శకానికి నాంది పలకబోతోందని నిర్మాతలు పేర్కొన్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా నేడు ట్రైలర్‌ను షేర్ చేసింది. YRF స్పై యూనివర్స్‌లో రాబోతున్న ఈ సినిమాలో.. హృతిక్ రోషన్ కబీర్‌గా తిరిగి రాగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో కనబడనున్నారు.

- July 25, 2025
0
111
Less than a minute
Tags:
You can share this post!
editor