తన జీవితంలో ప్రేమించి విఫలమైన ప్రేమ జ్ఞాపకాలున్నాయని, అందుకే పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయానని చెప్పింది హీరోయిన్ నిత్యామీనన్. అభినయ ప్రధాన పాత్రల ద్వారా దక్షిణాదిలో ఈ హీరోయిన్ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆమె నటించిన తాజా రొమాంటిక్ కామెడీ సినిమా ‘సార్ మేడమ్’ త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి నిర్మొహమాటంగా తన మనసులో మాటల్ని బయటపెట్టింది నిత్యామీనన్. గత ప్రేమబంధాలన్నీ విఫలమై మనోవేదనను మిగిల్చాయని, వాటి నుండి తాను పాఠాలు నేర్చుకున్నానని చెప్పింది. ‘యుక్త వయసులో ఉన్నప్పుడు సోల్‌మేట్ తప్పకుండా అవసరమనే భావనతో ఉండేదాన్ని. అతని కోసం అన్వేషించిన సందర్భాలున్నాయి. కానీ జీవిత ప్రయాణంలో నా అభిప్రాయాలు మారాయి. పెళ్లనేది కేవలం ఓ ఎంపిక మాత్రమేనని, తప్పనిసరి అవసరం కాదని అర్థం చేసుకున్నా. పెళ్లయితే అది చాలా గొప్ప విషయం, ఒకవేళ కాకున్నా అదీ గొప్ప విషయమే. తోడులేదని కాస్త బాధగా ఉన్నా స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉంది. రతన్‌టాటా కూడా వివాహం చేసుకోలేదు. అయినా ఆయన జీవితంలో ఎన్నో విజయాలు సాధించారు. ఏది జరిగినా అంతా మంచికే అనుకుని ముందుకుసాగాలి’ అని చెప్పుకొచ్చింది నిత్యామీనన్.

- July 24, 2025
0
62
Less than a minute
Tags:
You can share this post!
editor