‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’లో బాల‌య్య‌  సర్‌ప్రైజ్ ఎంట్రీ!

‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’లో బాల‌య్య‌  సర్‌ప్రైజ్ ఎంట్రీ!

ప‌వర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్ ప్రధాన పాత్ర‌లో రూపొందిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత ఎఎం రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఎఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా తెర‌కెక్కించారు. సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌కు వచ్చింది. ఇందులో బాల‌య్య కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు అని ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అత‌ను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. అక్కడ నుండి ఆయన హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి మొదటి సినిమా రివ్వ్యూ చేస్తున్నట్లు చెప్పాడు. సినిమా సూపర్‌గా ఉందని, థియేట‌ర్‌లో గూస్ బంప్స్ వస్తున్నాయని రివ్వ్యూ ఇచ్చాడు. హరిహర వీరమల్లులో బాలయ్య బాబు స్పెషల్ ఎంట్రీ ఉందని చెప్పాడు.

editor

Related Articles