సొంత ఇల్లే నాకు న‌ర‌కంగా మారిందన్న హీరోయిన్..

సొంత ఇల్లే నాకు న‌ర‌కంగా మారిందన్న హీరోయిన్..

బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ టాప్ హీరోయిన్‌గా ఓ రేంజ్‌లో బతికిన త‌నుశ్రీ ద‌త్తా. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్‌గా నిలిచి, ఆ తరువాత ‘ఆషిక్ బనాయా ఆప్నే’ వంటి పాటలతో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఆమె, 2005లో తెలుగులో ‘వీరభద్ర’ సినిమాలోనూ నటించింది. అయితే 2013 తర్వాత ఆమె తెరపైన కనిపించలేదు. తనుశ్రీ దత్తా, తాజాగా తన వ్యక్తిగత జీవితంతో మరోసారి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్‌లో ‘మీటూ’ ఉద్యమానికి బాట‌లు వేసిన‌ నటి తనుశ్రీ దత్తా గత ఆరేళ్లుగా తన సొంత ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ వీడియో రూపంలో వెల్లడించగా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనుశ్రీ కన్నీరు పెట్టుకుంటూ ఎమోష‌న‌ల్‌గా మాట్లాడింది. నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. ఏమీ మాట్లాడలేను, ప్రశాంతంగా ఉండలేను. పోలీసులకు ఫోన్ చేశాను, వారు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయమన్నారు. బహుశా రెండు రోజుల్లో  పోలీస్ స్టేషన్‌కు వెళ్తాను అని చెప్పారు. మరో వీడియోలో రాత్రివేళ్లలో తన ఇంటి బయట వినిపించే శబ్దాలను రికార్డ్ చేసి పోస్ట్ చేశారు. “ఈ శబ్దాలు నన్ను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిద్రలేక, ప్రశాంతత లేక మానసికంగా విసిగిపోయాను” అని చెప్పారు. ఇది కూడా వేధింపుల భాగమేనని అభిప్రాయపడ్డారు. ఈ వీడియోలపై స్పందించిన నెటిజన్లు తనుశ్రీకి మద్దతుగా నిలిచారు.

editor

Related Articles