షూటింగ్‌లతో బిజీ.. నాకు వీలుపడదు.. ఈడీతో హీరో రానా..!

షూటింగ్‌లతో బిజీ.. నాకు వీలుపడదు.. ఈడీతో హీరో రానా..!

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు మరో తేదీ కావాలని సినీ హీరో రానా దగ్గుబాటి కోరారు. సినిమా షూటింగ్‌ కారణంగా బుధవారం విచారణకు రాలేనని ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ రోహిత్‌ ఆనంద్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో విచారణకు ఎప్పుడు హాజరు కావాలో నేరుగా రానాకే తెలియజేస్తామని ఈడీ అధికారులు చెప్పారు. బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసిన సినీ ప్రముఖులపై ఈడీ అధికారులు ఈసీఐఆర్‌ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్‌రాజ్, ఆగస్టు 6న విజయ్‌ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు హాజరుకావల్సి ఉంది.

editor

Related Articles