బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా సన్ ఆఫ్ సర్దార్. విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాల్ థాకుర్ హీరోయిన్‌గా నటించబోతోంది. రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న సినిమాను హిందీలో సన్ ఆఫ్ సర్దార్ అని రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమాకు సన్ ఆఫ్ సర్దార్ 2 అంటూ సీక్వెల్ రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌తో పాటు ట్రైలర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాను మొదటగా జులై 25న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన చిత్రబృందం అనుకోని కారణాల వలన వారం రోజుల పాటు వాయిదా పడింది. దీంతో ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సినిమా నుండి కొత్త ట్రైలర్‌ను షేర్ చేసింది. దుజా అనే పేరుతో కొత్త ట్రైలర్‌ను లాంచ్ చేసింది.

- July 22, 2025
0
91
Less than a minute
Tags:
You can share this post!
editor