హాలీవుడ్ సినిమా అవతార్‌కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన సినిమా ఎన్నో రికార్డులని చెరిపేసింది. ఇప్పటికే అవతార్ సిరీస్‌లో వచ్చిన రెండు భాగాలు ప్రేక్షకులని ఎంతగానో అలరించడమే కాక కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. ఇప్పుడు మూడో పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవతార్ 3 సినిమా ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ శుక్రవారం వస్తున్న సినిమాతో థియేటర్స్‌లో ట్రైలర్ ప్రదర్శించనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. భారీ హాలీవుడ్ సినిమా అయిన మార్వెల్ ఫెంటాస్టిక్ ఫోర్ సినిమాతో కలిపి థియేటర్లలో ప్రదర్శించనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రెండింటి పైన ప్రేక్షకుల్లో ఆసక్తి భారీగా పెరిగింది. ఇప్పుడు మూడో పార్ట్‌లో ‘నిప్పు’ నేపథ్యంలో కథ సాగనుందని తెలుస్తోంది. ఈ కొత్త కథా కోణంతో పండోరా ప్రపంచం మరో అద్భుతంగా ప్రేక్షకులని అలరించనుంది. డిసెంబర్ 19న అవతార్ 3 రిలీజ్ కానుండడంతో, ఆ నెల 15 తర్వాత రిలీజ్ కావాల్సిన భారతీయ సినిమాలు తమ తేదీలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అనుకోవడంలో సందేహం లేదు.

- July 22, 2025
0
98
Less than a minute
Tags:
You can share this post!
editor