బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన సినిమా హరిహర వీరమల్లు. ఎఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమా సుమారు ఐదేళ్లుగా సెట్స్ పైనే ఉంది. ఎన్నో అవరోధాలు, సమస్యలని దాటుకుని జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ముఖ్యంగా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. నిన్న ఉదయం ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న పవన్, సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి హాజరు కావడం విశేషం. ఇక ఈ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పవన్ కళ్యాణ్ సినిమా పేర్లన్నీ కలిపి ఓ స్పెషల్ సాంగ్ తయారుచేసి ప్రదర్శించారు. ఈ సాంగ్ ఫ్యాన్స్ మదిలో ఆనందానికి అవధులు లేకుండా చేసింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా పేరు నుండి ఇప్పటి హరిహర వీరమల్లు వరకు ప్రతి సినిమాని టచ్ చేస్తూ ఈ సాంగ్ సాగింది. ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- July 22, 2025
0
38
Less than a minute
Tags:
You can share this post!
editor