‘కాంతార చాప్టర్ 1’ నుండి అప్‌డేట్..

‘కాంతార చాప్టర్ 1’ నుండి అప్‌డేట్..

 ‘కాంతార ఎ లెజెండ్ చాప్టర్ 1’ను తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్‌డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగిసినట్లు మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను వారు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కాంతార ప్రపంచం ఎలా ఉంటుందో రిషబ్ శెట్టి వివరించిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం ఆయన పడ్డ కష్టం మనకు తెలిపారు. కాంతార అంటే సినిమా కాదని.. తమ చరిత్ర అని రిషబ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మేకింగ్ వీడియోలో కాంతార సినిమాకి సంబంధించిన విజువల్స్, భారీ మేకింగ్, క్యాస్టింగ్ మనకు చూపెట్టారు. మొత్తానికి మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు కాంతార సిద్ధమవుతున్నట్లు ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాని  హోంబలే ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్ 2న వరల్డ్‌వైడ్ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

editor

Related Articles