ఇంట్లోకి వ‌చ్చిన పామును ప‌ట్టుకున్న సోనూసూద్..

ఇంట్లోకి వ‌చ్చిన పామును ప‌ట్టుకున్న సోనూసూద్..

ఇటీవల ఆయన నివసిస్తున్న ముంబైలోని సొసైటీ ఆవరణలోకి ఓ పాము ప్రవేశించడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. సోనూ సూద్ మాత్రం భయం లేకుండా స్వయంగా రంగంలోకి దిగి, ఆ పామును తన చేతులతో పట్టుకుని సురక్షితంగా ఓ సంచిలో వేశారు. సోనూ సూద్ పట్టుకున్నది విషరహితమైన ర్యాట్ స్నేక్ (జెర్రిపోతు) అని తెలిసింది. ఈ సంఘటన అనంతరం ఆయన ఒక ముఖ్యమైన సందేశాన్నిచ్చారు సోనూ. సాధారణ ప్రజలు పాములను పట్టుకునే ప్రయత్నం చేయవద్దని, ఇళ్లలోకి పాములు వస్తే వెంటనే నిపుణులను సంప్రదించి, వాటిని హింసించకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆయన ధైర్యానికి, అలాగే నిస్సహాయ ప్రాణుల పట్ల ఆయన చూపిన దయకు నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

editor

Related Articles