అమితాబ్‌ ‘డాన్‌’ దర్శకుడు చంద్ర బారోట్‌ కన్నుమూత

అమితాబ్‌ ‘డాన్‌’ దర్శకుడు చంద్ర బారోట్‌ కన్నుమూత

భారతీయ సినిమా పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు చంద్ర బారోట్‌ (86) ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన అమితాబ్‌ బచ్చన్‌ హీరోగా తెరకెక్కిన ‘డాన్‌’ సినిమాకి దర్శకత్వం వహించారు. 1978లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎంత పెద్ద హిట్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా బిగ్‌బీ అమితాబ్‌ కెరియర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. గత ఏడు సంవత్సరాలుగా పల్మనరీ ఫైబ్రోసిస్‌తో పోరాడుతున్నారు. ఆయన పల్మనరీ ఫైబ్రోసిస్‌తో పోరాడుతున్నట్లు ఆయన భార్య దీపా బారోట్‌ తెలిపారు. గురునానక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చికిత్స పొందారు. గతంలో ఆయన జస్లోక్‌ ఆసుపత్రిలో చేరారు. చంద్ర బారోట్‌ ఆయన కెరియర్‌లో మొత్తం ఐదు సినిమాలను తెరకెక్కించారు. 1970లో తొలిసారిగా పురబ్‌-పశ్చిమ్‌ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత మరో మూడు సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. ఇక 1978లో అమితాబ్‌ బచ్చన్‌తో డాన్‌ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా డాన్ సినిమాలకే ఓ ఒక పుస్తకంలా నిలిచింది. అప్పట్లోనే ఈ సినిమా రూ.7 కోట్లు వసూళ్లు సాధించింది. 1991లో ప్యార్ భార దిల్ సినిమా చేశారు. అనంతరం సినిమాలకు దూరమయ్యారు. చంద్ర బారోట్‌కు క్లాసిక్‌ సినిమా  డాన్‌ను రీమేక్‌ చేసిన బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ నివాళులర్పించారు.

editor

Related Articles