బీచ్ ఒడ్డున ప్రియాంక చోప్రాని ముద్దుల‌తో ముంచెత్తిన..

బీచ్ ఒడ్డున ప్రియాంక చోప్రాని ముద్దుల‌తో ముంచెత్తిన..

బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా, ఇప్పుడు స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. హాలీవుడ్‌కి వెళ్ళాక అక్కడ వరుసగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. 2018లో ఆమె అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ను వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. నిక్‌ జోనస్‌ తరచూ ప్రియాంకతో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడు. తాజాగా నిక్‌ బీచ్‌లో ప్రియాంకతో కలిసి తీసుకున్న ఓ వీడియోను షేర్ చేశాడు. ‘‘ఆమె లేకుండా..’’ అని ఎమోజీతో పేర్కొన‌గా, అంత‌లోనే ప్రియాంక పరిగెత్తుకుంటూ వచ్చి, అతడిని హత్తుకుని లిప్‌లాక్ పెట్టేసిని క్షణాన్ని వీడియోలో చూపించాడు. ఆ వీడియోకు అభిమానుల నుండి భారీ స్పందన వచ్చింది. నిక్‌ షేర్ చేసే ప్రతి ఫొటోకు లక్షల మంది లైక్స్‌, కామెంట్లు వస్తుంటే, ఈ వీడియోకు అయితే అంతకన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ప్రియాంక ఈ వీడియోను తన అకౌంట్‌లో షేర్ చేయకపోయినా, ఆమె బీచ్‌ ఫొటోలు మాత్రం పోస్టు చేసింది.

editor

Related Articles