దర్శకుడు రాజమౌళి తన యస్‌యస్‌ఎంబీ-29 సినిమాకు సంబంధించిన ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కారు. సిల్వర్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు అత్యుత్తమ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించాలని తపిస్తారు. ప్రస్తుతం మహేష్‌బాబుతో ఆయన పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలక షెడ్యూల్స్ హైదరాబాద్, ఒడిస్సాలో పూర్తయ్యాయి. త్వరలో కథానుగుణంగా కెన్యాలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. తాజా సమాచారం ప్రకారం కెన్యా షూటింగ్‌ను రద్దు చేసుకున్నారని వార్తలొస్తున్నాయి. అక్కడి రాజకీయ సంఘర్షణ కారణంగా షూటింగ్‌కు అవరోధాలు ఏర్పడొచ్చనే అనుమానంతో రాజమౌళి షూటింగ్‌ను క్యాన్సిల్ చేశారని అంటున్నారు. సౌతాఫ్రికా లేదా టాంజానియా వంటి దేశాల్లో ప్రత్యామ్నాయ లొకేషన్లలో సెర్చింగ్ చేసే పనిలో ఈ చిత్రబృందం ఉందని తెలుస్తోంది.

- July 18, 2025
0
92
Less than a minute
Tags:
You can share this post!
editor