దక్షిణాదితో పాటు హిందీ సినిమాలో కూడా భారీ విజయాలకు చిరునామాగా మారింది హీరోయిన్ రష్మిక మందన్న. గత మూడేళ్లుగా ఈ హీరోయిన్ తారాపథంలో దూసుకుపోతోంది. రష్మిక మందన్న నటిస్తున్న తాజా సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమా వస్తోంది. దీక్షిత్‌శెట్టి హీరో. హృద్యమైన ప్రేమకథగా రూపొందిస్తున్న ఈ సినిమా నుండి బుధవారం ‘నదివే..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ పాటకు స్వరాల్ని అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. రాకేందుమౌళి గీత రచన చేశారు. నదివే నువ్వు నదివే, నీ మార్పే రానుంది వినవే, నదివే నువ్వు నదివే, నీకే నువ్వియ్యాలి విలువే, సిలువ బరువేమోయక, సులువు భవితే లేదుగా, వెన్నెల వలదను కలువవు నువ్వు కావా, కాలేవా.. – అంటూ హృద్యమైన భావాలతో సాగిందీ పాట. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకి సమర్పకులు: అల్లు అరవింద్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్.

- July 17, 2025
0
43
Less than a minute
Tags:
You can share this post!
editor