దర్శకుడు రాజమౌళి తీసిన సినిమాలలో ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కాలేదు. ఆయన తీసిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించింది. ఇంత ప్రభంజనం సృష్టించిన బాహుబలి ఫ్రాంచైజ్ సినిమాలు కూడా తన కెరీర్‌లో బెస్ట్ సినిమాలు కాదంటూ పెద్ద బాంబ్ పేల్చాడు జక్కన్న. ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘జూనియర్’. ఈ సినిమా జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈవెంట్‌లో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు స్పందించిన రాజమౌళి, తన కెరీర్‌లో ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన సినిమా ‘ఈగ’ అని చెప్పారు. “సింహాద్రి తర్వాత మాస్ సినిమాలే తీయాలని అందరూ భావించారు. కానీ ‘సై’తో ఆ అంచనాలన్నీ బ్రేక్ చేసి, యూత్‌ఫుల్ సినిమా తీశాను. నచ్చిన కథకు తగ్గట్టుగా సినిమాలు తీయొచ్చని అర్థమైంది అని తెలిపారు. ఇక సాయి కొర్రపాటి మొదట ఈ సినిమాని చిన్న సినిమాగా ప్రారంభించారు. కానీ కాస్టింగ్ చూస్తే – శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్.. ఇలా ఒక్కొక్కరు చేరుతూ సినిమా స్థాయి పెరిగింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ‘వైరల్ వయ్యారి’ పాట గురించి మాట్లాడుతూ.. ఈ పాట ఎంత క్రేజ్ తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది సినిమాపై ఉన్న ఆసక్తిని పెంచింది అని అన్నారు. ఇక జెనీలియా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సేమ్ బ్యూటీ, సేమ్ గ్రేస్. ఈ సినిమాలో కొత్త జెన్నీని చూస్తారని సెంథిల్ ప్రామిస్ చేశారు. దాని కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని రాజమౌళి అన్నారు. అలానే దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు సినిమా బృందంపై కూడా రాజమౌళి ప్రశంసలు కురిపించారు.

- July 17, 2025
0
53
Less than a minute
Tags:
You can share this post!
editor