ఈ పీరియాడిక్ ‘కింగ్‌డమ్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ప్రచార సినిమాలకు అద్భుతమైన స్పందన లభించడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హిట్ పక్కా అంటూ నమ్మకం వెలిబుచ్చారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాల్ని మరింత ముమ్మరం చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్‌డమ్’ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం ‘అన్నా అంటేనే..’ అనే రెండో గీతాన్ని విడుదల చేశారు. దీనిని అనిరుధ్ రవిచందర్ స్వరపరచడంతో పాటు ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ హృదయానికి హత్తుకునేలా ఈ పాట సాగింది. ఇందులో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ సోదరులుగా కనిపించారు. ‘చిన్నతనమే ఏమైపోయే, నన్ను వదిలే నీదే చేయే, అంత కలలాగే కరిగే, అందమైన గూడే చెదిరే, కష్టమొచ్చినా ఇంకో వైపే.. కంటిరెప్పలా కాసే కాపే.. కొన్ని గుర్తులేవో మిగిలే, చిన్నిగుండె నాదే పగిలే, అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే.. కలబడతావే..’ అంటూ మనసును తాకే భావాలతో ఈ పాట సాగింది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు.

- July 17, 2025
0
43
Less than a minute
Tags:
You can share this post!
editor