‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్‌కై సన్నాహాలు!

‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్‌కై సన్నాహాలు!

ప్రభాస్ హీరోగా యాక్ట్ చేస్తున్న సినిమాల్లో “ది రాజా సాబ్” నుండి ఫ్యాన్స్‌కి మ్యూజికల్ ట్రీట్ ఇచ్చేలా లేటెస్ట్‌గా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా కొంచెం ఆలస్యం అయినా కూడా ఫ్యాన్స్‌కి మాత్రం దర్శకుడు మారుతీ అలాగే, సంగీత దర్శకుడు థమన్‌లు సాలిడ్ ట్రీట్‌ని ప్రామిస్ చేశారు. సినిమా ఇంట్రో గ్లింప్స్ నుండి మొన్న టీజర్ వరకు థమన్ ఇచ్చిన బీట్స్ ప్రత్యేకంగా నిలిచాయి. ఇలా ఎట్టకేలకి ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్‌కి రంగం సిద్ధం చేస్తున్నారట. ప్రస్తుత ఊహాగానాల ప్రకారం ఈ ఆగస్ట్ మొదటి వారంలో అలా మొదటి పాటని విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఫస్ట్ సింగిల్ కూడా ప్రభాస్‌పై డిజైన్ చేసిన సోలో సాంగ్ అన్నట్టుగా టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాని డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.

editor

Related Articles