ఇటీవల తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన ‘డి.ఎన్.ఎ’ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెండు రోజుల్లో థియేటర్లలోకి వస్తోంది. నిర్మాత సురేష్ కొండేటి ఈ సినిమాని ‘మై బేబి’ పేరుతో ఈనెల జూలై 18న 350కి పైగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సినిమా పంపిణీ హక్కులు హాట్‌కేక్‌ల్లా అమ్ముడయినట్లు చిత్రబృందం తెలిపింది. నెల్సన్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిమిషా సజయన్, అథర్వ మురళి కీలక పాత్రల్లో నటించారు. గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’, ‘పిజ్జా’ వంటి విజయవంతమైన అనువాద సినిమాలను అందించిన సురేష్ కొండేటి, ‘మై బేబి’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ‘మై బేబి’ చిత్రం పంపిణీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. వివిధ ప్రాంతాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఈ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ‘మై బేబి’ చిత్రం సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ను పొందింది. వైబోధ ఘిబ్రాన్ అందించిన సంగీతం, ఆధునిక సంబంధాలు, భావోద్వేగాలను చక్కగా చిత్రీకరించిన విధానంపై సమీక్షకులు ప్రశంసలు కురిపించారు.

- July 16, 2025
0
100
Less than a minute
Tags:
You can share this post!
editor