ఊ అంటావా పాట‌ని విదేశీయులు కూడా కాపీ కొట్టారుగా..

ఊ అంటావా పాట‌ని విదేశీయులు కూడా కాపీ కొట్టారుగా..

ఇంటర్నెట్ అందుబాటులోకి వ‌చ్చాక ప్రపంచంలోని అన్ని సినిమాలు, మ్యూజిక్, ఆర్ట్ అంతా కూడా అంద‌రికీ అందుబాటులోకి వచ్చేసాయి. ఈ క్ర‌మంలో సినిమాల క‌థ‌లు, సాంగ్స్, మ్యూజిక్ ఈజీగా కాపీ అయిపోతున్నాయి. హాలీవుడ్ సినిమాలకి సంబంధించిన‌ క‌థ‌, మ్యూజిక్ కాపీ చేస్తున్నారంటూ ద‌క్షిణాది, ఉత్తరాది టెక్నీషియ‌న్స్‌పై అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు వ‌చ్చేవి. ఇప్ప‌డు దేవిశ్రీ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఊ అంటావా సాంగ్‌ని విదేశీయులు కాపీ కొట్టారంటూ దేవిశ్రీనే స్వ‌యంగా పేర్కొన‌డంతో ఈ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దిల్‌రాజు డ్రీమ్స్ లాంచింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. నేను 5 నిమిషాల్లో చెన్నైలో క్రియేట్ చేసిన ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ సాంగ్‌ని ఎవరో కాపీ కొట్టారు. వాళ్ల మీద కేసు పెట్టాలా, ఏం చేయాలో అర్థం కాక ఆలోచనవో పడ్డాను అని అన్నారు. మ‌న తెలుగు సాంగ్‌ని కాపీ కొట్టినందుకు గర్వంగా కూడా ఉందన్నారు. ఈ సాంగ్ ఎవ‌రు కాపీ కొట్టారా అని  నెటిజన్స్ నెట్‌లో వెతకడం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో ఏడు నెల‌ల క్రితం ట‌ర్కిష్ సింగ‌ర్ మ‌న పాట‌ని కాపీ కొట్టిన‌ట్టు తేలింది. టర్కిష్ సింగర్ అతియే ఊ అంటావా సాంగ్ మ్యూజిక్‌ని కాపీ కొడుతూ ‘అన్లయినా..’ అంటూ టర్కిష్ భాషలో ఓ ప్రైవేట్ సాంగ్‌ని చేయ‌గా, ఈ సాంగ్ అచ్చం మ‌న సాంగ్ మాదిరిగానే ఉంది. దీంతో ఈ వీడియోపై నెటిజ‌న్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాపీ కొడితే కొట్టావు కానీ కనీసం క్రెడిట్స్ అయిన ఇవ్వాలి క‌దా అని అంటున్నారు.

editor

Related Articles