పాటల రచయితగా మారిన హీరో రామ్

పాటల రచయితగా మారిన హీరో రామ్

మన హీరోలు పాటలు పాడటం కామనే కానీ.. రాయడం మాత్రం అరుదనే చెప్పాలి. తన తాజా సినిమా ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ కోసం హీరో రామ్‌ గీత రచయితగా అవతారమెత్తారు. భావోద్వేగభరితమైన ఓ పాటకు లిరిక్స్‌ అందించారు. ఈ పాటను స్వరకర్త అనిరుధ్‌ ఆలపించడం మరో విశేషమని మేకర్స్‌ తెలిపారు. ‘గీత రచయితగా రామ్‌ తొలి ప్రయత్నమిది. చక్కటి భావాలు కలబోసి ఆయన అద్భుతమైన పాట రాశాడు. ఈ సాంగ్‌ విజువల్స్‌, లొకేషన్స్‌ అన్నీ మెస్మరైజింగ్‌గా అనిపిస్తాయి. ఈ నెల 18న ఈ పాటను రిలీజ్‌ చేయబోతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్స్‌, ప్రమోషనల్‌ కార్యక్రమాల్ని మొదలుపెట్టారు. సినిమా హీరో అభిమాని కథగా ఈ  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్‌, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. వివేక్‌-మెర్విన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

editor

Related Articles