ల‌వ్‌లో ప‌డ్డ‌ గాడ్ ఫాద‌ర్ బ్యూటీ..

ల‌వ్‌లో ప‌డ్డ‌ గాడ్ ఫాద‌ర్ బ్యూటీ..

చిన్న పాత్రే అయినా గుర్తుండిపోయే రోల్‌లో కనిపించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన తాన్యా. ఈ నటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార చెల్లెలిగా క‌నిపించిన తాన్యా ర‌విచంద్ర‌న్ గుర్తుండే ఉంటుంది? తాన్యా.. తెలుగులో ‘పేపర్ రాకెట్’ వెబ్ సిరీస్ ద్వారా, తమిళంలో పలు సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ తన ప్రేమను సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. “ఒక ముద్దు.. ఒక ప్రామిస్.. ఎప్పుడూ.. ఎప్పటికీ కలిసే.. అంటూ త‌ను షేర్ చేసిన ఫొటోకి క్యాప్షన్‌గా పెట్టింది తాన్యా. ఆ ఫొటోలో తాన్యా తన ప్రియుడికి లిప్‌లాక్ ఇస్తూ కనిపిస్తోంది. ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ పలువురు సెలబ్రిటీలు కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం “ఇప్పుడే పెళ్లా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాన్యా మనసు దోచుకున్నవాడు మరెవరో కాదు. కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గౌతమ్ జార్జ్. త్వ‌ర‌లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారు.

editor

Related Articles